28 August, 2026 | 9:57 AM

కేజీబీవీలో ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు

28-08-2026 08:49 AM

కోటపల్లి, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా కోటపల్లి కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో రాఖీ పౌర్ణమి వేడుకలను(Rakhi Purnima celebrations) ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రత్యేక అధికారిణి హరిత ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో ఉపాధ్యాయులు, విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినులు, ఉపాధ్యాయులు ఒకరికొకరు రాఖీలు కట్టుకొని రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.

రాఖీ పండుగ విశిష్టత, సోదరభావం, ప్రేమానురాగాలు, పరస్పర ఆత్మీయత గురించి విద్యార్థినులకు వివరించారు. పండుగను పురస్కరించుకొని పాఠశాల ప్రాంగణంలో సందడి వాతావరణం నెలకొంది. విద్యార్థినులు సాంప్రదాయ దుస్తుల్లో పాల్గొని వేడుకలను ఆనందంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమం విద్యార్థుల్లో సోదరభావం, ఐక్యత, భారతీయ సంస్కృతి, సంప్రదాయాల పట్ల అవగాహన పెంపొందించేలా సాగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.