ప్రజలంతా సోదరభావంతో మెదలాలి: కలెక్టర్ కుమార్ దీపక్
28-08-2026 | 10:32am
మంచిర్యాల, (విజయక్రాంతి) : మంచిర్యాల జిల్లా ప్రజలు కుల, మతాలకు అతీతంగా సోదరభావంతో మెదలాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్(Collector Kumar Deepak) అన్నారు. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలు, ఆత్మీయతకు ప్రతీకగా నిలిచే రక్షాబంధన్‌ను ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కలెక్టర్ ఆకాంక్షించారు. మహిళలకు రక్షణ, గౌరవం కల్పించాలనే బాధ్యతను ఈ పండుగ గుర్తుచేస్తుందని, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి పండుగను సంతోషంగా, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు. రాఖీ పండగ (రక్షాబంధన్) సందర్భంగా జిల్లా ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.