6 July, 2026 | 4:16 PM

Breaking News

అనుమతి లేని తరగతులను సీజ్ చేసిన ఎంఈఓ రాజయ్య   •   ఎకో టూరిజం అభివృద్ధి చేయాలి: సీఎం రేవంత్​ రెడ్డి   •   ప్రజావాణి దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలి   •   8వ రోజుకు చేరిన సింగరేణి అధికారుల రిలే నిరాహార దీక్షలు   •   సుల్తానాబాద్ లో జగ్జీవన్ రామ్ కు ఘనంగా నివాళులు   •   ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం   •   విద్యార్థులను పరామర్శించిన ఆర్సీవో సత్యనాథ్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు   •   ధర్మారం పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన సర్పంచ్ బాలాజీ   •   108, 102 వాహన సేవలను సద్వినియోగపరచుకోండి: వైద్యాధికారి రమేష్   •   ప్రభుత్వ హాస్టల్ సమస్యలపై ప్రజావాణిలో ఆర్డీఓకి వినతి   •  

మరో ఏసీపీ ఆఫీసు కానుందా..

05-03-2026 12:09 PM

ఏసీపీ పరిధిని రెండుగా విభజించి మరో ఏసీపీ నియామకం? 

షాద్‌నగర్,(విజయక్రాంతి): కొత్తగా డీసీపీ కార్యాలయం ఏర్పాటు జరిగిన షాద్‌నగర్‌లో మరో ఏసిపి కార్యాలయం(ACP office) ఏర్పాటు చేసేందుకు ఉన్నతాధికారులు ఆలోచిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే షాద్‌నగర్‌లో ఏసీపీ కార్యాలయం కొనసాగుతోంది అయితే డీసీపీ కార్యాలయం(DCP Office) కింద రెండు ఎసిపి కార్యాలయలు ఉంటే బాగుంటుందని పరిపాలన సౌలభ్యంగా ఉంటుందని ఆలోచిస్తున్నారు. ఇందుకు సంబంధించి కొత్తూరు, నందిగామ, కేశంపేట పోలీస్ స్టేషన్ల తో కొత్త ఏసీపీ  కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నట్లు తెలిసింది. కొత్తగా ఏర్పాటు చేయబోయే ఎసిపి కార్యాలయాన్ని కొత్తూరులో ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందని యోచిస్తున్నట్లు తెలిసింది ఏదేమైనా త్వరలోనే కొత్త ఏసిపి కార్యాలయం కార్యరూపం దాల్చనున్నట్లు తెలియ వచ్చింది