20 July, 2026 | 6:52 PM

Breaking News

నూతన ఎస్‌ఐ అనిల్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఉపసర్పంచ్   •   విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలి: షీటీం ఎస్ఐ ఫజల్ ఖాన్   •   మితిమీరిన వేగంతో డ్రైవింగ్... కారు బోల్తా యువకుడు మృతి   •   నీట్ పేపర్ లీక్ - కేంద్ర మంత్రి రాజీనామాకు పీవైఎల్ డిమాండ్   •   ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని వెంటనే పునఃప్రారంభించాలి: డాక్టర్ వై. అనూప్ రావు   •   కాంగ్రెస్ హయాంలోనే మహిళలకు పెద్దపీట - కౌన్సిలర్ జాలిగం విఘ్నేష్   •   కెల్లేడులో సర్ శత శాతం పూర్తి   •   ఉపసర్పంచులకు విబి జీ రామ్ జీ జాయింట్ చెక్ పవర్ అమలు చేయాలి   •   అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం   •   రైతులు ఆరుతడి పంటలు వేయాలి   •  

కృష్ణా నదిపై మరో బ్యారేజీ నిర్మించాలి

20-07-2026 01:15 AM

శ్రీశైలం 67 గ్రామాల నిర్వాసితులకు న్యాయం చేయాలి

చిన్నంబావి, జూలై 19: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో క్రౌన్ గార్డ్ ఫంక్షన్ హాల్ లో సాగు నీటి సమస్యలపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో కొల్లాపూర్ నియోజక వర్గం జేఏసీ తరుపున  పెరుమాళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కృష్ణ నది సుమారు 200 కిలోమీటర్ల ప్రవహిస్తూ నేపథ్యం లో కొల్లాపూర్, అలంపూర్,గద్వాల, వనపర్తి జిల్లాలో అనేక గ్రామాల్లో ప్రజలు నిర్వసితులుగా మారారని వారందరికీ న్యాయం చేయాలన్నారు.

పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ,జూరాల, భీమా చివరి ఆయకట్టు ప్రాంతంగా ఉన్న ఉమ్మడి వీపనగండ్ల మండలంలో సుమారు 45 వేల ఎకరాలకు నీళ్ళు అందించడానికి కృష్ణ నదిపై మరో లిఫ్టు లేదా బ్యారేజ్ నిర్మాణం చేస్తే చివరి ఆయకట్టు ప్రాంతాలకు పుష్కలంగా సాగు,త్రాగు నీరు అందించవచ్చని  తెలిపారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ మల్లు రవి,మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వివిధ పార్టీల జిల్లా అధ్యక్షులు, పలు నియోజకవర్గాల జేఏసీ ఇన్చార్జీలు,రాఘవాచారి,ప్రకాశ్ గౌడ్, తిమ్మప్ప, వెంకటేశ్వర్లు, కొల్లాపూర్ తరుపున తెలంగాణ ఉద్యమకారులు దేశగౌని రామన్ గౌడ్,పెరుమాళ్ళ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.*