calender_icon.png 25 November, 2025 | 12:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కర్ణాటకలో మళ్లీ సీఎం మార్పు రగడ!

25-11-2025 12:16:33 AM

  1. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు సీఎం సిద్ధు ఒత్తిడి

సీఎం ఎవరో అధిష్ఠానం తేల్చాలని డీకే శివకుమార్ పట్టు

ఢిల్లీకి వెళ్లిన డిప్యూటీ సీఎం ఆరుగురు ఎమ్మెల్యేలు

బెంగళూరు, నవంబర్ 24: కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం మార్పు రగడ రోజురోజుకూ తీవ్రమవుతోంది. మళ్లీ సీఎం గా ఎవరనే వివాదం తెరపైకి వచ్చింది. సీఎం సిద్ధరామయ్య మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు ఒత్తిడి తెస్తున్నప్పటికీ, ప్రభుత్వానికి ఎ వరు నాయకత్వం వహిస్తారనే ప్రశ్నను కాం గ్రెస్ హైకమాండ్ ముందే తేల్చుకోవాలని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పట్టుబడుతున్నట్లు సమాచారం.

పార్టీలోని అనేక మం ది వ్యక్తుల అభిప్రాయం ప్రకారం, కాంగ్రెస్ హైకమాండ్ క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణకు ఆమోదం తెలిపితే, సిద్ధరామయ్య పూర్తి ఐ దేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేస్తారని, ఇది శివకుమార్ అత్యున్నత పదవిని చేపట్టే అవ కాశాలను దెబ్బతీస్తుందని తెలుస్తోంది. రెం డున్నరేండ్ల పాలన తర్వాత ముఖ్యమంత్రి మార్పు సాధ్యమవుతుందనే ఊహాగానాలు పెరుగుతున్నందున, కాంగ్రెస్ నాయకుడు, డిప్యూటీసీఎం శివకుమార్ మద్దతుదారుల్లో ఆరుగురు ఎమ్మెల్యేలు నాయకత్వ మార్పుపై చర్చించడానికి ఆదివారం రాత్రి ఢిల్లీకి వెళ్లారు.

ఇప్పటికే దేశ రాజధానికి వెళ్లిన శివకుమార్ శిబిరంతో వారు చేరే అవకాశం ఉం ది. సీఎం సిద్ధరామయ్య నాయకత్వ మా ర్పు పై హైకమాండ్ తుది నిర్ణయం తీసుకుంటుందని, దానిని తాను, డిప్యూటీ సీఎం కూడా అంగీకరించాలని ఆసక్తికర వ్యాఖ్యలు చేశా రు. యాదృచ్ఛికంగా, దళిత సీఎం ప గ్గాలు చేపట్టాలనే డిమాండ్ల మధ్య, కేపీసీసీ మాజీచీఫ్, హోంమంత్రి జి.పరమేశ్వర కూడా సీఎం బరిలోకి దిగారు.

ప్రస్తుతం ఢిల్లీలో ఉ న్న శివకుమార్ అనుకూల శిబిరానికి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలతో పాటు, కేపీసీసీ చీఫ్‌ను సీఎం చేయాలని అధిష్ఠానా న్ని అభ్యర్థించడానికి మరికొంత మంది ఎమ్మె ల్యేలు  త్వరలో ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉం దని పార్టీ వర్గాలు తెలిపాయి. కర్ణాటకలో ఉన్న ఖర్గే ఢిల్లీకి వెళ్లే అవ కాశం ఉందని, రాహుల్ గాంధీ విదేశాల నుంచి తిరిగొచ్చాక, సీఎం మార్పు వివాదంపై చర్చించి, ఒక కొలిక్కి తీ సుకురావచ్చని పార్టీవర్గాలు చెబుతున్నాయి.