24-11-2025 03:26:15 PM
ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర(Dharmendra) మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) సంతాపం తెలిపారు. భార సినీ చరిత్రలో ఒక శకం ముగిసిందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. నటించిన ప్రతి పాత్రలోనూ ధర్మేంద్ర జీవించారని ప్రధాని మోదీ కొనియాడారు. ధర్మేంద్ర తన నటనతో అనేక పాత్రలకు వన్నె తెచ్చారని పేర్కొన్నారు. ఇది ఎంతో విచారకరమైన సమయం అన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాడ సాననుభూతి తెలియజేస్తున్నానని ప్రధాని ఎక్స్ లో పేర్కొన్నారు. ధర్మేంద్ర 300లకు పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. బాలీవుడ్ లో అత్యధిక హిట్ చిత్రాల నటుడిగా ధర్మేంద్ర రికార్డు నమోదు చేశారు. షోలే, ఆయీ మిలన్ కీ బేలా, ఫూల్ ఔర్ పత్తర్, ప్యార్ కియా తో డర్నా క్యా, సీతా ఔర్ గీతా, జీవన్ మృత్య్, మేరా గామ్ - మేరా దేశ్, రాజా జానీ, యాదోం కీ బారాత్, దోస్త్, చరస్, ధర్మవీర్ వంటి సినిమాల్లో నిటించారు. ధర్మేంద్ర, హేమమాలిని జంట హిట్ పెయిర్ గా పేరు తేచ్చుకున్నారు. షోలే సహా అనేక సినిమాల్లో ధర్మేంద్ర-హేమమాలిని నటించారు.
సినీ దిగ్గజాలలో ఒకరైన ప్రముఖ నటుడు ధర్మేంద్ర సోమవారం ముంబై నివాసంలో 89 సంవత్సరాల వయసులో(Dharmendra passes away) కన్నుమూశారు. చిత్రనిర్మాత కరణ్ జోహార్(Karan Johar) భావోద్వేగ సోషల్ మీడియా పోస్ట్‌లో మరణాన్ని ధృవీకరించారు. డిసెంబర్ 8న ఆయన 90వ పుట్టినరోజుకు కొన్ని వారాల ముందు ధర్మేంద్ర తుదిశ్వాస విడిచారు. ధర్మేంద్ర కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. నవంబర్ 10న, ధర్మేంద్ర ఆరోగ్యం క్షీణించడంతో ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేరారు. ఈ క్లిష్ట సమయంలో డియోల్ కుటుంబానికి సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్, గోవింద వంటి అనేక మంది ప్రముఖ సినీ ప్రముఖులు ఆసుపత్రిని సందర్శించి మద్దతుగా నిలిచారు. రెండు రోజుల తరువాత, కుటుంబం ఇంటి చికిత్సను ఎంచుకోవడంతో ధర్మేంద్ర ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. ముంబయిలోని పవన్ హన్స్ శ్మశానవాటికలో ధర్మేంద్ర అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆయన అంత్యక్రియలకు సినీ, రాజకీయ ప్రముఖలు హారయ్యారు. బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర మృతి పట్ల ప్రముఖులు నివాళలర్పిస్తున్నారు.