calender_icon.png 25 November, 2025 | 12:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెషావర్‌లో ఆత్మాహుతి దాడులు

25-11-2025 12:18:06 AM

  1. పాక్ పారా మిలిటరీ ప్రధాన ఆఫీసు గేటు వద్ద, లోపల కాల్పులు
  2. కాల్పుల్లో ఆరుగురు మృతి
  3. మృతుల్లో ముగ్గురు పాక్ కమాండోలు.. ముగ్గురు ఆత్మాహుతికి పాల్పడిన వారు
  4. అనేక మందికి గాయాలు

ఇస్లామాబాద్, నవంబర్ 24: పాకిస్తాన్‌లోని పెషావర్‌లో పారా మిలిటరీ ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని సోమవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ము ష్కరులు, ఆత్మాహుతి బాంబర్లు దాడి చేశా రు. ఈ దాడుల్లో పాకిస్తాన్‌కు చెందిన ముగ్గు రు కమాండోలు, మరో ముగ్గురు ముష్కరులు మరణించారు. సోమవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ఇద్దరు ఆత్మాహుతి బాంబర్లు పారామిలిటరీ ప్రధాన కార్యాల యం ప్రధాన ద్వారం తెరిచి కాల్పులు జరిపారు.

దీంతో ముష్కరులు ఆవరణలోకి చొరబడ్డారని, ఈ కాల్పుల్లో ఆరుగురు మరణించారని, అనేక మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. పారామిలిటరీ భ వనం ప్రధాన ద్వారం వద్ద రెండు పేలుళ్లతో దాడి ప్రారంభమైందని, ఆవరణలోకి చొరబడి భద్రతా సిబ్బందితో కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు. ఎఫ్‌సీ కమాండోలు, పోలీసు విభాగాలు కాల్పులు జరిపి  ప్రాంగణం లోపల ముగ్గురు దాడి చేసిన వారిని కాల్చి చంపాయన్నారు.

ఈ భవనంపై కనీసం ఇద్దరు ఆత్మాహుతి బాం బర్లు దాడి చేశారు. ప్రవేశ ద్వారం వద్ద జరిగిన పేలుడులో ము గ్గురు ఎఫ్‌సీ సిబ్బంది మరణించగా, ఆ తరాత జరిగిన కాల్పుల్లో దాడి చేసినవారు మృతి చెందారని పోలీసులు తెలిపారు. బాంబు దాడి జరిగిన వెం టనే రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు తీసుకున్నామని అధికారులు పేర్కొన్నారు.

ప్రస్తుతం ఆ ప్రాం తంలో లాక్‌డౌన్ విధించినట్లు, భద్రతా బలగాలు, స్కాడ్ బృందాలు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని తనిఖీలు చేపట్టాయి. ప్రధాన కార్యాలయం లోపల కొం తమంది ఉగ్రవాదు లు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. పెషావర్ క్యా పిటల్ సిటీ పోలీస్ అధికారి డాక్టర్ మియాన్ సయీద్ మాట్లాడుతూ, ఆ ప్రాంతాన్ని పూర్తిగా మూసి వేస్తున్నామని, తనిఖీలు నిర్వహిస్తున్నా మని, భద్రతాచర్యలు తీసుకుంటున్నామ న్నారు.

ఇంతలో, ఖైబర్ పఖ్తుం ఖ్వా ఐజీ జు ల్ఫికర్ హమీద్ కూడా ఆత్మాహుతి బాంబు దాడులను ధృవీకరించారు. సద్దర్ ప్రాంతానికి సమీపంలోని ఫెడరల్ కనస్ట్టాబులరీ ప్ర ధాన కార్యాలయంలో పేలుళ్లు జరిగాయన్నారు.