27 July, 2026 | 6:06 PM

Breaking News

బీజిలిపూర్ ఎస్సీకాలనీ కరెంట్ సమస్య పరిష్కరించరా?   •   అర్హులందరికీ ఓటు హక్కు కల్పించాలి: ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   భాగీరథిపల్లిలో రూ.25 లక్షల కల్వర్టు నిర్మాణానికి భూమిపూజ   •   ఇల్లందు ఏరియాలో సింగరేణి ఉద్యోగులకు క్వార్టర్ల కౌన్సిలింగ్ నిర్వహణ   •   నేరేడుచర్లలో భాజపా ఆధ్వర్యంలో " సర్" ప్రక్రియపై సమీక్ష   •   రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి   •   ఎక్స్‌టార్షన్‌కు పాల్పడిన నిందితులు అరెస్ట్.. రిమాండ్   •   తొలిముద్ద కార్యక్రమాన్ని ప్రారంభించిన కార్పొరేటర్ కంచర్ల హిమశ్రీ   •   ప్రభుత్వ, ఆశ్రమ పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించాలి   •   వేపల మాధవరం గ్రామానికి మై హోమ్ చేయూత   •  

రాష్ట్రంపై నిర్లక్ష్యానికి మరో నిదర్శనం

02-02-2026 02:28 AM
  1. నిధులు రాబట్టడంలో రెండు పార్టీలూ విఫలం
  2. కేంద్ర బడ్జెట్‌పై మాజీమంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్, ఫిబ్రవరి 1 (విజయక్రాంతి): కేంద్రబడ్జెట్ 2026---27 తెలంగాణపై కొనసాగుతున్న నిర్లక్ష్యానికి మరో స్పష్టమైన నిదర్శనమని మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. దేశ ఆర్థిక వృద్ధికి కీలకంగా దోహదపడుతున్న తెలంగాణకు ఈ బడ్జెట్‌లోనూ న్యాయం జరగకపోవడం శోచనీయమని తెలిపారు. కేంద్ర బడ్జెట్‌పై ఆదివా రం ట్విట్టర్ వేదికగా హరీశ్‌రావు స్పందించారు. రీజినల్ రింగ్ రోడ్డు, హైదరాబాద్ మెట్రో విస్తరణ, రైల్వే ప్రాజెక్టులు, సాగునీటి ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులు లేకపోవడం ఉద్దేశపూర్వక నిర్లక్ష్యమని వెల్లడించారు.

తెలంగాణ పట్ల కేంద్రం ప్రదర్శిస్తున్న స్పష్టమైన ఆర్థిక అన్యాయం ఇది అని పేర్కొన్నారు. పార్లమెంట్‌లో తెలంగాణ గొంతు వినిపించడంలో కాంగ్రెస్, బీజేపీ రెండు జాతీయ పార్టీలు ఘోరంగా విఫలమయ్యాయని విమర్శించారు. తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నా, బడ్జెట్ లో తెలంగాణకు నిధులు రాబట్టలేక పోవడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి 60కిపైగా సార్లు ఢిల్లీ వెళ్లినా, వాటి ఫలితం మాత్రం శూన్యమని ఎద్దేవా చేశారు. .