calender_icon.png 2 February, 2026 | 3:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేడారం జాతర ఏర్పాట్లు భేష్

02-02-2026 01:40:40 AM

మంత్రి సీతక్కను అభినందించిన విజయక్రాంతి దినపత్రిక ఎండీ విజయరాజం

అమ్మవార్లకు విజయరాజం తులాభారం సమర్పణ

కాళేశ్వరం/మంథని, ఫిబ్రవరి 1 (విజయక్రాంతి): దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం అద్భుతంగా నిర్వహించిందని విజయక్రాంతి దిన పత్రిక ఎండీ విజయరాజం పేర్కొన్నారు. ఆదివారం విజయరాజం మేడారం అమ్మవార్ల దర్శనానికి విచ్చేయగా, మంత్రి సీతక్క ఘనంగా స్వాగతం పలికి దగ్గరుండి అమ్మవార్ల దర్శనం చేయించారు. ఈ సందర్భం గా మంత్రి సీతక్కను విజయరాజం అభినందించారు.

తల్లుల దర్శనానికి వచ్చిన భక్తుల కు ఇబ్బందులు కలుగకుండా పోలీస్ శాఖతోపాటు అన్ని శాఖల అధికారులు నిరంత రం కృషి చేశారని కొనియాడారు. మంత్రి సీతక్క దగ్గరుండి విజయ రాజంను తీసుకొని వెళ్లి సమ్మక్క- సారల మ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులకు ప్రత్యే క పూజలు చేయించారు

. విజయరాజం అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుని, తల్లులకు నిలుఎత్తు బంగారం సమర్పించారు. తెలంగాణ గుండె చప్పుడు విజయక్రాంతి దినపత్రిక అని, అనతికాలంలోనే తెలంగాణ ప్రజల మన్ననలను పొందిందని మం త్రి సీతక్క అన్నారు. నిజాలను నిర్భయంగా రాస్తూ అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు వారధిగా నిలుస్తుందని కొనియాడారు. తెలంగాణ ముద్దుబిడ్డ సీఎల్ రాజం తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారని ఈ సందర్భంగా విజయరాజంతో మంత్రి సీతక్క గుర్తు చేశారు.

కాళేశ్వరంలో ప్రత్యేక పూజలు

100 ఏళ్లకు ఒకసారి వచ్చే పుష్య ఆర్క యోగంలో ఆదివారం మాఘ మాసం, పున్నమి, పుశమి నక్షత్ర సహితంగా ఉన్న పవిత్ర సమయంలో కాళేశ్వర ముక్తేశ్వర స్వా మి త్రివేణి సంగమంలో విజయరాజం స్నానమాచరించారు. అనంతరం కాళేశ్వర ముక్తేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు.