19 March, 2026 | 5:54 PM

అమెరికాలో మరోమారు కాల్పులు..

23-07-2024 12:31 AM

నైట్ క్లబ్‌లో కాల్పులు జరిపిన దుండగుడు

ముగ్గురి మృతి.. 16 మందికి గాయాలు

మిస్సిసిపి, జూలై 22: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. మిస్సిసిపిలోని ఓ నైట్ క్లబ్‌లో దుండగుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా.. 16 మంది వరకు గాయపడ్డారు. తుపాకీతో ఉన్న ఆగంతకుడు కాల్పులు జరపడం వల్లే ఈ ఘోరం జరిగిందని మీడియా కథనాలు వెల్లడించాయి. ఇండియానోలా మేయర్ కెన్ ఫేథర్‌స్టోన్ ముగ్గురు చనిపోయినట్లు ధ్రువీకరించారు. మరణించిన యువకులు 19 సంవత్సరాలు వయసు ఉంటారని ఆయన పేర్కొన్నారు. ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది. దుండగుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రస్తుతం ఆ దుండగుడు పరారీలో ఉన్నట్లు సమాచారం.