23 June, 2026 | 5:26 PM

Breaking News

గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యం   •   ప్రీవెడ్డింగ్ షూట్‌లో ప్రియుడితో కలిసి కాబోయే భర్తను చంపిన యువతి   •   రోడ్డు ప్రమాదంలో డాన్స్ మాస్టర్ మృతి   •   రెవిన్యూ రికార్డులను పరిశీలించిన కలెక్టర్   •   బిగ్ డేటా యుగంలో ఈ-కామర్స్ భద్రతపై పరిశోధనకు పీహెచ్‌డీ   •   మాదిగల్లో అక్షరాస్యత పెంపుకు 40 రోజుల "గో టు విలేజ్" కార్యక్రమం   •   నెల్లిపాక భూములపై ప్రొహిబిషన్ ఎత్తివేయాలి   •   విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉంటేనే బంగారు భవిష్యత్   •   ఐఎస్‌ సదన్‌లో భారీ చోరీ.. రూ.17 లక్షలతో పరారైన ఏటీఎం క్యాష్ వ్యాన్ డ్రైవర్   •   రైతులకు అందుబాటులో విత్తన మేళ   •  

నవ్వులు పంచే గాయపడ్డ సింహం

07-02-2026 12:00 AM

తరుణ్ భాస్కర్ కథానాయకుడిగా మరో యూనిక్ మూవీ రాబోతోంది. ఈ సినిమాను డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్నారు. సప్తస్వ మీడియా వర్క్స్, పీవోవీ స్టోరీస్, జీ స్టూడియోస్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని కళ్యాణ చక్రవర్తి మంథిన, భానుకిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేశ్ బన్సాల్ నిర్మిస్తున్నారు. దర్శకుడు పవన్ సాదినేని సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ఈ సినిమా టైటిల్‌ను మేకర్స్ శుక్రవారం రివిల్ చేశారు. ‘గాయపడ్డ సింహం’ అనే పేరుతో వస్తున్న ఈ సినిమాకు ‘నవ్వకండి! ఇది చాలా సీరియస్ మేటర్!’ అనేది ట్యాగ్‌లైన్.

టైటిల్ పోస్టర్‌ను చూస్తుంటే ఇదొక పొలిటికల్ సెటైర్, క్రైమ్, హాస్యం కలగలిసిన ఎంటర్‌టైనర్ అని తెలుస్తోంది. ఫిబ్రవరి 9న ఈ మూవీ టీజర్‌ను విడుదల కానుందని మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రంలో ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి కథానాయికలు కాగా.. విష్ణు ఓయి, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తయింది. ఒక పాట చిత్రీకరణ మిగిలి ఉంది. సూర్యప్రకాశ్ జ్యోసుల కథను అందించిన ఈ చిత్రానికి విద్యాసాగర్ చింత సినిమాటోగ్రఫీని, స్వీకర్ అగస్తి సంగీతాన్ని అందిస్తుండగా, విప్లవ్ నైషధం ఎడిటర్‌గా, చంద్రిక గొర్రెపాటి ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు.