07-02-2026 12:00:00 AM
విరాట్ కర్ణ హీరోగా దర్శకుడు అభిషేక్ నామా రూపొందిస్తున్న చిత్రం ‘నాగబంధం’. ఈ వేసవిలో వినోదం పంచేందుకు సిద్ధమవుతున్న ఈ సినిమా టీజర్.. మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 15న రిలీజ్ కానుంది. అంతకన్నాముందు ఈ ఇతిహాస కథనంలోని ఓ కీలక పాత్ర ఫస్ట్‌లుక్‌ను మేకర్స్ శుక్రవారం విడుదల చేశారు. బాలీవుడ్ ‘ఫైటర్’ ఫేమ్ రిషబ్ సాహ్నీ ఈ సినిమాలో ఆఫ్ఘన్ సుల్తాన్ అబ్దాలి పాత్రను పోషిస్తున్నారు.
1750లో బ్యాక్‌డ్రాప్‌లోని ఈ చిత్రంలో భారత్‌లో అబ్దాలీ చేసిన దండయాత్రలు, దేవాలయాల దోపిడీ, అపార సంపద కోసం అతడు చేసిన క్రూర ప్రయత్నాలను చూపించబోతున్నారు. రిషబ్ సాహ్నీ ఫస్ట్‌లుక్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. నభా నటేష్, ఐశ్వర్య మీనన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాలో జగపతిబాబు, జయప్రకాశ్, మురళీశర్మ, బీఎస్ అవినాష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం నిర్మాణం తుది దశకు చేరుకుంది. ఈ చిత్రానికి సంగీతం: అభే, జునైద్ కుమార్; సినిమాటోగ్రఫీ: సౌందర్ రాజన్ ఎస్; ప్రొడక్షన్ డిజైనర్: అశోక్‌కుమార్; ఎడిటర్: ఆర్‌సీ ప్రణవ్.