calender_icon.png 9 May, 2025 | 1:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘హరి హర వీరమల్లు’లో అనుపమ్ ఖేర్

09-08-2024 12:05:00 AM

పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’. ఈ పీరియాడికల్ యాక్షన్ చిత్రానికి మరో అదనపు ఆకర్షణ తోడైంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఇందులో భాగమయ్యారు. ఈ చిత్రంలో ఆయన అత్యంత విలువైన పాత్ర పోషిస్తున్నారు. పవన్ కళ్యాణ్‌తో ఆయన తొలిసారి తెరను పంచుకోనున్నారు. ఏ దయాకర్‌రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, జ్యోతి కృష్ణ ఇటీవల ‘హరి హర వీరమల్లు’ చిత్ర దర్శకత్వ బాధ్యతలను తీసుకోగా,  ఛాయాగ్రాహకుడిగా మనోజ్ పరమహంస వ్యవహరిస్తున్నారు.

త్వరలోనే మిగతా భాగం చిత్రీకరణను ప్రారంభించనున్నారు. ప్రస్తుతం చిత్రబృందం లొకేషన్ల వేటలో ఉంది. మరోవైపు నిర్మాణానంతర పనులు ప్రారంభించారు. వీఎఫ్‌ఎక్స్ పనులూ జరుగుతున్నాయి. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. పార్ట్-1: ‘స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ త్వరలో విడుదల కానుంది.