ప్రభాస్ చిత్రంలో అనుపమ్ ఖేర్
టాలీవుడ్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం డైరెక్టర్ హను రాఘవపూడితో ఓ ప్రాజెక్ట్ కోసం కొలాబరేట్ అయిన సంగతి తెలిసిం దే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం లార్జర్ దెన్ లైఫ్ ఎలిమెంట్స్ తో విజువల్ వండర్‌గా ఉండబోతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్‌ను ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా షూటింగ్ ప్రస్తు తం జరుగుతోంది.
ఇందులో ఓ ముఖ్యమైన పాత్ర కోసం బాలీవుడ్ దిగ్గజ నటుడు అనుపమ్ ఖేర్ భాగమయ్యారు. ఈ విష యాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడి యా వేదికగా వెల్లడించారు.‘ఇండియన్ సినిమా బాహుబలి ప్రభాస్‌తో నా 544వ చిత్రా న్ని ప్రకటించినందుకు ఆనందం గా ఉంది. ఆయనతో స్క్రీన్ స్పేస్‌ను పంచుకోవడానికి ఉత్సాహంగా ఉన్నాను.
ఈ సినిమాకు అద్భుతమైన, ప్రతిభావంతు లైన హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తు న్నారు’ అని అనుపమ్ రాసుకొచ్చారు. గొప్ప పాత్రలు చేయడంలో పేరుపొందిన అనుపమ్, ఈ స్క్రిప్ట్‌ను ‘అద్భుతం’ అని పేర్కొనటంతో ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.
1940 హిస్టారికల్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్‌లో మాతృభూమి ప్రజలకు న్యాయాన్ని అందించడానికి పోరాటం చేసే ఓ యోధుడి కథగా ఉండబోతోందీ చిత్రం. ఇందులో ప్రభాస్ సరసన హీరోయిన్‌గా ఇమాన్వి నటిస్తుండగా, మిథున్ చక్రవర్తి, జయప్రద కీలక పాత్రలు పోషిస్తున్నారు. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు డీవోపీ: సుదీప్ ఛటర్జీ; సంగీతం: విశాల్ చంద్రశేఖర్.






