నా ఫోకస్ అంతా వాటిపైనే..
ఈ ఏడాది నిధి అగర్వాల్ టైం చాలా బాగున్నట్టుంది. స్టార్ హీరోల సరసన నటిస్తోంది. ‘హరిహర వీరమల్లు’, ‘ది రాజాసాబ్’తో ఈ ఏడాది ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తను నటిస్తున్న సినిమాల గురించి నిధి అగర్వాల్ మాట్లాడింది. అలాగే 2022లో విరామం తీసుకోవడానికి కారణాన్ని సైతం నిధి అగర్వాల్ వివరించింది.
“నేనేం స్టార్ కిడ్‌ని కాను.. సినీ నేపథ్యమూ లేదు. అలాంటప్పుడు నేను నటిగా తొలి స్థానంలో ఉండటమనేది సాధారణ విషయం కాదు. అసలు సినిమాల్లో అవకాశాలు రావడమే నాకు విజయంతో సమానం. ఎక్కువ సినిమాలు చేయాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. నేను మాత్రం నమ్మకం ఉన్న కథలనే ఎంచుకుని వాటిపైనే ఫోకస్ పెడతా.
వరుసగా కమర్షియల్ చిత్రాలు చేసుకుంటూ పోవడానికి నేనేం హీరోని కాను. ఒకవేళ చేసినా కూడా అలాంటి స్క్రిప్ట్‌లు ఎంచుకున్నందుకు నాపై విమర్శలు వెల్లువెత్తు తాయి. అందుకే గొప్ప కథలను మాత్రమే ఎంచుకుంటున్నా” అని నిధి అగర్వాల్ తెలిపింది.
ఇప్పటి వరకూ నేను చేసిన వాటిల్లో ‘హరిహర వీరమల్లు’ పాత్ర అత్యుత్తమమైనది. దాని కోసం గుర్రపు స్వారీ, క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకున్నా. నాకు హారర్ సినిమాలంటే గతంలో భయం ఉండేది. అందుకే ‘ది రాజాసాబ్’ చేయాలనుకున్నా” అని నిధి అగర్వాల్ చెప్పుకొచ్చింది.






