ఏ బంధమైనా ముగియడానికి నిర్లక్ష్యమే కారణం
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే నటీమణుల్లో సమంత ఒకరు. ఆమె తన లైఫ్, ఆరోగ్యం, సిని మా.. ఇలా ప్రతి ఒక్క విషయంపై స్పందిస్తూ ఉంటారు. తాజాగా సమంత జీవిత భాగస్వామిపై ఒక సందేశాత్మక పోస్ట్‌ను సోషల్ మీడియాలో పెట్టింది. భాగస్వామిని ఉద్దేశించి జేశెట్టి అనే రచయిత ఓ వీడియో ద్వారా కొన్ని విషయాలను చెప్పారు.
ఆ వీడియోను సమంత తన ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేసింది. ఏ బంధమైనా ముగిడానికి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడమేనన్నారు. “ఒక మంచి బంధాన్ని అద్భుతమైన భాగస్వామితో కలిగి ఉండొచ్చు కానీ మీ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోకుంటే కోరు కున్న విధంగా భాగస్వామికి కనిపించలేరు.
ఉదాహరణకు ఎదుటి వ్యక్తిలో అంతా చక్కగా ఉందని మనం భావిస్తాం కానీ మన మనసు, శరీరం ఎలా ఉందనేది మాత్రం పట్టించుకోం. అలాంటప్పుడు ఆ వ్యక్తిని ఏదో ఒక సమయంలో కోల్పోవల్సి రావొచ్చు” అని సమంత పేర్కొన్నారు. సమంత పోస్ట్ నెట్టింట బాగా వైరల్ అవుతోంది.
సమంత ఇటీవల ‘సీటాడెల్: హనీ బన్నీ’ ప్రాజెక్టుతో అలరించింది. అలాగే కొన్ని నెలల క్రితం స్వీయ నిర్మాణంలో ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాను ప్రకటించింది. మరోవైపు ‘రక్త్ బ్రహ్మాండ్’ అనే సిరీస్ లోనూ నటిస్తోంది.






