13 July, 2026 | 9:57 PM

Breaking News

కార్మికులకు ప్రత్యేక వైద్య శిబిరం   •   తప్పకుండా ఆల్బెండాజోల్ మాత్రలు తీసుకోవాలి   •   33/11 కెవి అచ్చంపేట సబ్ స్టేషన్ లో ఫైవ్ ఎంవిఏ ట్రాన్స్ఫార్మర్ ప్రారంభించిన ఎస్ఇ శాలియా నాయక్   •   నిరుపేద విద్యార్థినికి రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేత   •   డంపింగ్ యార్డ్ తరలింపుకై జరుగుతున్న పాదయాత్రలను జయప్రదం చేయండి   •   నులిపురుగులను నిర్మూలిద్దాం... ఆరోగ్యాన్ని కాపాడుకుందాం   •   ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •  

శ్రీలంక అధ్యక్షుడిగా అనుర కుమార దిసనాయకే

23-09-2024 11:54 AM

కోలంబో: తీవ్ర ఆర్థిక సంక్షోభంతో దివాలా అంచున ఉన్న శ్రీలంకలో ఉత్కంఠగా సాగిన త్రిముఖ పోరులో చివరకు మార్క్సిస్టు నేత అనుర కుమార దిసనాయకే పై చేయి సాధించారు. రాజప క్సే కుటుంబ అవినీతి పాలనకు విసిగిపోయి మార్క్సిస్టు విధానాలపై మొగ్గు చూపే దిసనాయకేను శ్రీలంక ప్రెసిడెంటుగా ఎన్నకున్నారు. 42.31 శాతం ఓట్లు సాధించిన దిసనాయకే తొలుత 1987లో మార్క్సిస్టు ప్రభావిత జనతా విముక్తి పెరమున(జేవీపీ)లో చేరి తన రాజకీయ పునాది నిర్మించుకున్నారు.

విద్యార్థి నేతగా మెదలై దేశాధినేతగా ఎదిగిన దిసనాయకే శ్రీలంక రాజకీయాల్లో ఓ సంచలనంగా చెప్పుకోవచ్చు.1968 నవంబర్ 24న కోలంబో సమీపంలోని తంబుట్టెగామలో కార్మిక కుటుంబంలో ఆయన జన్మించారు. స్థానికంగానే పాఠశాల విద్య చదివిన దిసనాయకే తన గ్రామంనుంచి తొలి యూనివర్సిటీ గ్రాడ్యుయేట్. బ్యాచులర్  అఫ్ సైన్స్ లో పట్టభద్రుడైన ఆయన తర్వాత సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ లో చే రి విద్యార్థి రాజకీయాల్లో్ కీలక పాత్ర పోషించడం ద్వారా తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. కాగా  దిసనాయకే  సోమవారం  శ్రీలంక అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని అధికార వర్గాలు పేర్కొన్నాయి.