14 July, 2026 | 2:00 AM

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి

13-07-2026 09:34 PM

రాజాపూర్: పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే నులిపురుగుల నివారణ కోసం ఆల్బండాజోల్ మాత్రలు తప్పనిసరిగా వేయించాలని డాక్టర్ సుస్మిత అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలు పంపించేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే చేతులను పరిశుభ్రంగా వాడుకోవాలని గోల్డెన్ ఎప్పటికప్పుడు కత్తరించుకోవాలని సూచించారు. భోజనం చేసే ముందు చేతులను సబ్బుతో శుభ్రంగా కడుకోవాలని సూచించారు. ఒకటి నుంచి 19 ఏళ్ల వయసు గల పిల్లలందరికీ ఆల్బెండజోల్ మాత్రలు కచ్చితంగా వేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ రాధాకృష్ణ,ఎంపీడీవో విజయలక్ష్మి, సర్పంచ్ రామకృష్ణ, ప్రధానోపాధ్యాయుడు సయాది ఇబ్రహీం, ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.