14 July, 2026 | 2:06 AM

డంపింగ్ యార్డ్ తరలింపుకై జరుగుతున్న పాదయాత్రలను జయప్రదం చేయండి

13-07-2026 09:43 PM

డంపింగ్ యార్డ్ తరలింపుకై రాజీవ్ గాంధీ నగర్ లో పాదయాత్ర

జవహర్ నగర్, (విజయక్రాంతి): జవహర్ నగర్ లో నెలకొని ఉన్న డంపింగ్ యార్డ్ తరలింపుపై జరుగుతున్న పాదయాత్రలను జయప్రదం చేయాలని జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ఎత్తివేత పోరాట కమిటీ పిలుపునిచ్చింది. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ రాజీవ్ గాంధీ నగర్ లో భరించలేని దుర్గంధాన్ని రాంకీ డంపింగ్ యార్డ్ ను తొలగించాలని కోరుతూ జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ఎత్తివేత పోరాట కమిటీ సోమవారం టిఆర్ఎస్(జాగృతి) మాజీ కార్పొరేటర్ మేక లలితా యాదవ్ ఆధ్వర్యంలో పాదయాత్రను నిర్వహించారు.

దీనిపై ప్రజలలో అవగాహన కల్పించేందుకు జూలై ఒకటో తారీకు నుండి 20వ తారీకు వరకు డంపింగ్ యార్డ్ ప్రభావిత ప్రాంతాలైన కీసర, శామీర్ పేట, కాప్రా, యాప్రాల్ మండలాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు జవహర్ నగర్ లోని పలు బస్తీలలో పాదయాత్రలు చేపట్టామని వివరించారు. ఈనెల 26వ తేదీన జరిగే పర్యావరణం ఆరోగ్య భద్రత జీవించే హక్కు పై జరిగే సదస్సులో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ సదస్సును జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.