14 July, 2026 | 2:14 AM

కార్మికులకు ప్రత్యేక వైద్య శిబిరం

13-07-2026 09:55 PM

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): రాజంపేట గ్రామపంచాయతీ పరిధిలో లేబర్ హెల్త్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో కార్మికుల కోసం సోమవారం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల శిబిరం నిర్వహించారు. శిబిరంలో కార్మికులకు రక్త, మూత్ర, షుగర్ పరీక్షలతో పాటు ఇతర వైద్య పరీక్షలు నిర్వహించి, వారి ఆరోగ్య పరిస్థితిని వైద్య సిబ్బంది పరిశీలించారు. కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు ఇలాంటి శిబిరాలు ఎంతో ఉపయోగకరమని  సర్పంచ్ బుర్సా పోచయ్య పేర్కొన్నారు. శిబిరంలో కార్మికులు ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు.ఈ కార్యక్రమంలో  వార్డ్ సభ్యుల ఫోరం జిల్లా అధ్యక్షులు గులాం జావిద్, బిల్ కలెక్టర్ నాగేందర్, గ్రామపంచాయతీ సిబ్బంది, లేబర్ హెల్త్ డిపార్ట్‌మెంట్ అధికారులు పాల్గొన్నారు.