14 July, 2026 | 2:03 AM

నులిపురుగులను నిర్మూలిద్దాం... ఆరోగ్యాన్ని కాపాడుకుందాం

13-07-2026 09:40 PM

ఇబ్రహీంపేట్ సర్పంచ్ ఉద్దెర సంధ్యారాణి రాజ్ కుమార్

బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని ఇబ్రహీంపేట్ గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాలలోనీ విద్యార్థిని విద్యార్థులకు నూలి పురుగుల నివారణ మాత్రలను సోమవారం గ్రామ సర్పంచ్ ఉద్దెర సంధ్యారాణి రాజకుమార్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ సంధ్యారాణి మాట్లాడుతూ... తొమ్మిదేళ్లలోపు పిల్లలందరూ ఆల్ఫాండోజం మాత్రలను తప్పకుండా వేసుకోవాలనీ హోలీ పురుగులను తరిమికొట్టాలని ఆమె సూచించారు.

ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఆల్బెండజోల్‌ మాత్రలు 400 గ్రాముల చొప్పున వేసుకోవాలనీ,1-2 ఏళ్లలోపు పిల్లలు 200 గ్రాముల మాత్ర వేసుకోవాలన్నారు.కచ్చితంగా భోజనం చేసిన తరువాత నమిలి లేదా చప్పరించి ఈ మాత్రలు కడుపులోకి పంపించాలనీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాఘవేందర్ ఉపాధ్యాయులు వైద్య సిబ్బంది విద్యార్థులు తదితరులు ఉన్నారు