20-02-2026 01:18:38 PM
ఘట్ కేసర్, ఫిబ్రవరి 20 (విజయక్రాంతి): అనురాగ్ యూనివర్సిటీకి చెందిన పది మంది నేషనల్ సర్వీస్ స్కీమ్ (ఎన్ఎస్ఎస్) వాలంటీర్లు బెంగళూరులోని డాక్టర్ మన్మోహన్ సింగ్ బెంగళూరు యూనివర్సిటీలో జరగనున్న ప్రతిష్టాత్మక నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్ కు ఎంపికయ్యారు. ఈ శిబిరం ఫిబ్రవరి 20 నుండి 26 వరకు జరగనుంది. దేశవ్యాప్తంగా ఉన్న యువతలో సాంస్కృతిక మార్పిడి జాతీయ సమైక్యతా భావాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఈశిబిరాన్ని నిర్వహిస్తున్నారు.
అనురాగ్ యూనివర్సిటీ నుండి ఎంపికైన వాలంటీర్లు కొచ్చెర్ల కార్తీక్, టి.ఆర్. చర్చిత, కత్రోత్ కళ్యాణ్, ఎన్. మౌనవ్య రెడ్డి,బి. వెంకటరమణ, ఎన్. రోహిత్ కుమార్, ఆర్. హన్సిక, వి. ఝాన్సీ, టి. తేజస్వినిరెడ్డి ఆకాష్ రాథోడ్ ఉన్నారు. ఈబృందానికి తెలంగాణ నుండి అనురాగ్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ జె. రాజేంద్ర కుమార్ కంటింజెంట్ లీడర్‌గా వ్యవహరించనున్నారు. విద్యార్థుల ప్రతిభను అభినందిస్తూ అనురాగ్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ అర్చన మంత్రి, డీన్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ డాక్టర్ విజయ్ కుమార్, ఎన్.ఎస్.ఎస్ సెల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ సి. మల్లేశ విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు.