27 June, 2026 | 8:41 PM

విద్యుత్ సమస్యల పరిష్కారం కొరకు ప్రజా బాట

27-06-2026 08:07 PM

విద్యుత్ పట్టణ ట్రాన్స్ కో ఏఈ సంతోష్ కుమార్

బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని విద్యుత్ సమస్యల పరిష్కారం కొరకు ప్రజా బాట కార్యక్రమాన్ని శనివారం విద్యుత్ పట్టణ ట్రాన్స్ కో ఏఈ సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ సంతోష్ కుమార్ మాట్లాడుతూ... పట్టణ ప్రజలకు ఎలాంటి విద్యుత్ సమస్యలు ఉన్న 24 గంటల పాటు సిబ్బంది అందుబాటులో ఉంటారు.

తక్షణమే పరిష్కారం చేసేందుకు ట్రాన్స్ కో సిబ్బంది సిద్ధంగా ఉన్నారని ఎలాంటి సమస్యలు ఉన్న ట్రాన్స్ కో సిబ్బందికి తెలియజేయాలని ఆయన సూచించారు. టోల్ ఫ్రీ నెంబర్ 1912 నెంబర్ కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని అలాగే పట్టణ విద్యుత్ శాఖ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్ కో ఇన్స్పెక్టర్ రాజేంద్రప్రసాద్, బలరాం ట్రాన్స్ కో సిబ్బంది ఉన్నారు.