27 June, 2026 | 7:32 PM

Breaking News

నిజామాబాద్ జీపీవోపై గ్రామస్తుల ఫిర్యాదు   •   నిరుపేదల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ముఖ్య లక్ష్యం   •   క్యూబాపై అమెరికా ఆంక్షలు ఎత్తివేయాలి   •   సోనాల మండల కేంద్రంలో పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయండి   •   మొక్కలు నాటడం మున్సిపాలిటీ వంతు.. రక్షణ దేవుడి వంతు   •   జిల్లా బిజెపి (ఓబీసీ) రూరల్ అధ్యక్షులుగా మహేందర్ యాదవ్ ఎన్నిక   •   అంబర్పేటలో ఘనంగా డాక్టర్ గునిగంటి ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు   •   గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి   •   అరకొర వసతుల మధ్య సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని చూసి హాస్టల్లో రామంటున్న విద్యార్థులు   •   విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది   •  

పౌష్టికాహారం అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం

20-02-2026 01:20 PM

ఊర్కొండ: పౌష్టికాహారం అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు రమేష్ నాయక్ అన్నారు. గురువారం మండలంలోని గుడ్లగుంటపల్లి గ్రామంలో అంగన్వాడి కేంద్రంలో చిన్నారులతో పాటు గర్భిణీలు బాలింతలకు పౌష్టిక ఆహారం అందించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం వచ్చిన అనతి కాలంలోనే ప్రజలకు కావలసినటువంటి సకల సౌకర్యాలతో పాటు సదుపాయాలను కల్పించడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నదని అన్నారు. అందులో భాగంగానే గ్రామాల్లో ఉన్నటువంటి మహిళ తల్లులకు గర్భిణీలు బాలింతలతో పాటు చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తుందని  ఈ అవకాశాలను అందరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్  రజని,  ఉపసర్పంచ్ కొండలు తదితరులు ఉన్నారు