సమస్యల పరిష్కారం కోసమే ఆందోళన
03-12-2024 07:09 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో ఆశ వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం బుధవారం నిర్మల్ జిల్లా కేంద్రంలో ఒకరోజు సమ్మెను నిర్వహించడం జరుగుతుందని అందుకు అధికారులు సహకరించాలని మంగళవారం ఆ సంఘం నాయకులు అధికారులకు సమ్మె నోటీసులు అందజేశారు. వేతనాల పెంపు, పెండింగ్ బకాయిల విడుదల, ఉద్యోగ భద్రత, డిమాండ్లతో ఈ ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని జిల్లా అధ్యక్షురాలు భాను సుజాత అధికారులకు తెలిపారు. సమ్మెకు అధికారులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్ల సంఘం నాయకురాలు రామలక్ష్మి, చంద్రకళ పాల్గొన్నారు.




