చర్లపల్లి డివిజన్ సమగ్ర అభివృద్ధికి కృషి
03-12-2024 07:04 PM
కాప్రా: చర్లపల్లి డివిజన్ సమగ్రభివృద్ధికి కృషి చెయ్యనున్నట్లు ధీడం కార్పొరేటర్ బొంతు శ్రీదేవి పేర్కొన్నారు. చర్లపల్లి డివిజన్ పరిధిలోని వైష్ణవి ఎంక్లేవ్ కాలనీలో పర్యటించి సమస్యలు అడిగి గుంతలమయంగా మారిన సిసి రోడ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాలనీలో గుంతలమయమైన రోడ్ల తక్షణమే తాత్కాలిక సపర్యలు చేపట్టి శాశ్వత పరిష్కారం చూపెడతామని కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ గారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏ ఈ స్వరూప, ప్రెసిడెంట్ గంప కృష్ణ, గంగా ఈశ్వరయ్య, కార్తీక్ గౌడ్, ప్రభాకర్ రెడ్డి, మహేందర్ రెడ్డి, అనిల్ కుమార్, సంతోష్ రెడ్డి, జగ్గ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, కొండల్ రెడ్డి, చెన్న రెడ్డి, శ్రీనివాస్, విష్ణు మూర్తి, బలమని తదితరులు పాల్గొన్నారు.




