14 May, 2026 | 4:03 AM

ధాన్యం కొనుగోలులో జాప్యం చేస్తే సహించేది లేదు

14-05-2026 03:02 AM

కలెక్టర్  ఆశిష్ సంగువాన్

కామారెడ్డి, మే 13 (విజయక్రాంతి): ధాన్యం సేకరణలో నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగువాన్ అన్నారు. బుధవారం కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం గిద్దలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అధికారులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడారు. వారి ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేసి వచ్చే నాలుగు రోజుల్లో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో లారీలు, హమాలీల కొరత లేకుండా అధికారులు లు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఎండల తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతు లు ఇబ్బందులు పడకుండా కొనుగోలు ప్రక్రియను ఉదయం, సాయంత్రం వేళలో నిర్వహించాలన్నారు.

కొనుగోలు కేంద్రాల్లో ఉన్న రైతులకు తాగునీరు, ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు, అవసరమైన మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఫార్మసీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. కలెక్టర్ తో పాటు జిల్లా సివిల్ సప్లై అధికారులు వెంకటేశ్వర్లు, డి ఆర్ డి ఏ పి డి సురేందర్, సివిల్ సప్లై మేనేజర్ శ్రీకాంత్, ప్రత్యేక అధికారులు, ఎంపీడీవో ,తాసిల్దార్, వ్యవసాయ అధికారి, మండల విద్యాశాఖ అధికారి తదితరులు పాల్గొన్నారు.