ఘనంగా శ్రీమరకత ఆత్మలింగేశ్వర స్వామి దివ్య ప్రతిష్ఠ మహోత్సవం
నాగిరెడ్డిపేట్,మే 13 (విజయక్రాంతి): మండలంలోని పెద్ద ఆత్మకూరు గ్రామంలో శ్రీమరకత ఆత్మలింగేశ్వర స్వామి దివ్య ప్రతిష్ట మహోత్సవం కార్యక్రమం గ్రామస్తులు భక్తులు ఘనంగా జరుపుకున్నారు. లోక కళ్యాణార్థమై పెద్ద ఆత్మకూరు గ్రామంలో సుందరమైన శివ దేవాలయాన్ని నిర్మించుకొని వైభవంగా త్రయాహిన్యక విధానంలో శ్రీశ్రీశ్రీ మరకత ఆత్మలింగేశ్వర స్వామి దివ్య ప్రతిష్ట మహోత్సవం మొదటిరోజు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు.
మూడు రోజుల కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు గణపతి పూజ, పుణ్యవచన, అఖండ దీపస్థాపన, రక్షాబంధనం, మాతృక, యోగిని, వాస్తు, క్షేత్రపాలక, నవగ్రహ, సర్వతో భద్ర మండల దేవత ఆవాసనం, అగ్నిప్రతిష్ట, గణపతి హావనం, బింబ సంస్కారం, ప్రతిమశోధనము, అగ్నిఅవతారణం, జలధివాసం, తీర్థప్రసరణ వితరణ తదితర కార్యక్రమాలు మొదటి రోజు నిర్వహించడం జరిగిందని గ్రామస్తులు, మాజీ సర్పంచ్ గడ్డం బాల్రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఉమ్మన్నగారి లక్ష్మి,మాజీ సర్పంచ్ గడ్డం బాల్రెడ్డి, గ్రామస్తులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.






