29 May, 2026 | 2:13 AM

హరీష్ రావుపై నోరుజారితే సహించేది లేదు

29-05-2026 01:40 AM

కాంగ్రెస్ నాయకులను హెచ్చరించిన బీఆర్‌ఎస్

సిద్దిపేట, మే 28 (విజయక్రాంతి): మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావును విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదని, ఆయన మీద నోరు జారితే సహించేది లేదని హెచ్చరించారు. రైతులు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్ముకోలేక రోజుల తరబడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనీ, చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని సిద్దిపేట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పాల సాయిరాం, ఉమ్మడి మెదక్ జడ్పీ మాజీ వైస్ చైర్మన్ రాగుల సారయ్య లు డిమాండ్ చేశారు.

అకాల వర్షాల కారణంగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్ద అయితే, బాధ్యత కలిగిన ప్రజా ప్రతినిధిగా హరీష్ రావు స్పందించి రైతులకు భరోసా కల్పిస్తున్నారు. సిద్దిపేటలో ఏ చిన్న సమస్య వచ్చినా స్పందించే గుణం హరీష్ రావుపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు.

రైతులు పండించిన పంట అమ్ముకునేందుకు రైతులు పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ చిల్లర నాయకులుగా తయారయ్యారు, హరీష్ రావుని విమర్శిస్తే పెద్ద లీడర్లమైతామని భ్రమలో ఉన్నారనీ మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో చిన్నకోడూరు మండల పార్టీ అధ్యక్షులు కాముని శ్రీనివాస్, పాక్స్ చైర్మన్ లు కోల రమేష్ గౌడ్, కనకరాజు, వెంకట్ రెడ్డి, బిఆర్‌ఎస్ నాయకులు కొండం రవీందర్ రెడ్డి, కీసరి పాపయ్య, ఆంజనేయులు, పరుశరాములు, లక్ష్మారెడ్డి, రెడ్డి యాదగిరి, శ్రీనివాస్ రెడ్డి, ప్రశాంత్, రాజశేఖర్ రెడ్డి భానులు పాల్గొన్నారు.