calender_icon.png 6 February, 2026 | 8:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చదువుతో ఏదైనా సాధించవచ్చు

06-02-2026 06:57:00 PM

ఐఏఎస్ అకడామి చేర్మెన్ బాలలత

సదాశివనగర్,(విజయక్రాంతి): నేటి సమాజంలో డబ్బుతో సాధించలేనిది కేవలము చదువుతూనే ఏదైనా సాధించవచ్చని అందుకు నిదర్శనం తానేనని ఐఏఎస్ అకాడమీ చైర్మన్ బాలలత అన్నారు.శుక్రవారం సదాశివనగర్ మండలం పద్మాజివాడి గ్రామ పరిధిలోని స్ప్రింగ్ ఫీల్డ్ పాఠశాలలో ఏర్పాటుచేసిన విద్యార్థుల సమావేశంలో ఆమె మాట్లాడారు. తాను వికలాంగురాలు నైన కష్టపడి గురి తప్పకుండా ఐఏఎస్ ను రెండుసార్లు పరీక్ష రాసి ర్యాంకును సాధించానని అన్నారు.తన గురి ఎప్పుడు తప్ప లేదని ఎవరు ఎన్ని మాటలు అన్న తాను పట్టించుకోకుండా తన లక్ష్యాన్ని నెరవేర్చి ఇతరులకు ఆదర్శంగా నిలిచానని అన్నారు.

నేటి తరంలో ప్రతి ఒక్కరు చదువుతూనే జీవితం మొదలవుతుందని, పై చదువులు చదివి స్థిరపడితే కొన్ని తరాలు బాగుపడతాయని విద్యార్థులకు సూచించారు. నూతనంగా ఏర్పాటు చేస్తున్న ధనిక్ భారత్ విద్యాసంస్థలలో విద్యార్థులు చేరి తమ భవిష్యత్తును భావితరాలకు ఉపయోగపడేలా తీర్చిదిద్దేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ సందర్భంగా బాలలత గారిని స్ప్రింగ్ ఫీల్డ్ పాఠశాల ప్రిన్సిపల్ భద్రప్ప ఆధ్వర్యంలో సిబ్బంది శాలువతో  ఘనంగా సన్మానం చేసి మేమంటూ అందజేశారు. కార్యక్రమంలో స్ప్రింగ్ ఫీల్డ్ సిబ్బంది ధనిక్ భారత్ విద్యాసంస్థల ప్రతినిధులు తదితరులు.