06-02-2026 06:48:21 PM
అశ్వాపురం,(విజయక్రాంతి): నెల్లిపాక బంజర గ్రామంలో స్వయంభువుగా వెలసిన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ అభినవ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో 22వ వార్షికోత్సవ తిరుకళ్యాణ మహోత్సవాన్ని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుకళ్యాణ మహోత్సవం భక్తులను కనువిందు చేసేలా అద్భుతంగా సాగింది. ఆలయ కమిటీ చైర్మన్ వీరమాచినేని రాజశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని కనులారా వీక్షించి మొక్కులు చెల్లించుకుని మహా అన్నప్రసాదాన్ని స్వీకరించారు.