06-02-2026 07:05:21 PM
జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే
రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో రగుడు వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ను జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే శుక్రవారం రోజున తనిఖీ చేసి వాహన తనిఖీల రిజిస్టర్లు పరిశీలించరు. చెస్ పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి వివరాలను నమోదు చేయాలన్నారు.పోలింగ్ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉంటూ ఓటర్లను ప్రలోభ పెట్టే విధంగా జరిగే నగదు,మద్యం వంటి అక్రమ రవాణాను అరికట్టాలని సూచించారు. ప్రజలందరూ తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకునేలా పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.