ఏపీ మంత్రులుగా ప్రమాణం చేసింది వీళ్లే...
అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో నూతన ప్రభుత్వం కొలువుదీరింది. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 164 స్థానాల్లో గెలుపొంది, వైసీపీని 11 సీట్లకే పరిమితం చేసింది. ఇవాళ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నాలుగోసారి నూతన ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతోపాటు మరో 24 మంది రాష్ట్ర మంత్రులుగా ప్రమాణం చేశారు.టీడీపీ నుంచి నారా లోకేష్, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, పొంగూరి నారాయణ, వంగలపూడి అనిత, నిమ్మల రామానాయుడు, ఫరూక్, ఆనం రామనారాయణ రెడ్డి, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, డోలా బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవి కుమార్, గుమ్మిడి సంధ్యారాణి, బీసీ జనార్ధన్ రెడ్డి, టీజీ భరత్, ఎస్. సవిత, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఏపీ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. జనసేన నుంచి పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్ ప్రమాణం చేయాగా, బీజేపీ నుంచి సత్యకుమార్ యదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈసారి ఈ క్యాబినెట్ లో 17 మంది కొత్తవారే ఉన్నారు. అందులో ముగ్గురు మహిళలు, 8 మంది బీసీలు, 2 ఎస్సీలు, ఒక ఎస్టీ, ఒక వైశ్య సామాజిక వర్గ నేత ఉన్నట్లు సమాచారం.






