మంత్రిగా అచ్చెన్నాయుడు ప్రమాణ స్వీకారం
12-06-2024 12:43 PM
అమరావతి : ఆంధ్రప్రదేశ్ మంత్రిగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆయనతో పదవీ ప్రమాణం చేయించారు. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అచ్చెన్నాయుడు టెక్కలి నియోజకవర్గం నుంచి పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుపొందారు. 1995లో హరిశ్చంద్రపురం నుంచి తొలిసారి ఎంఎల్ఎగా విజయం సాధించిన ఆయన 1999, 2004 లోనూ హరిశ్చంద్రపురం నుంచే ఎంఎల్ఎగా ప్రాతినిధ్యం వహించారు. 2014లో టెక్కలి నుంచి గెలిచి ఐదేళ్లపాటు రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చెప్పటారు. 2019 ఎన్నికల్లోనూ టెక్కలి నుంచి విజయం సాధించి, 2021 నుంచి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకారించారు. 2024 ఎన్నికల్లో 34 వేల ఓట్లకు పైగా తేడాతో తన సమీప అభ్యర్థిపై గెలుపొందారు.






