మోదీకి శాలువా కప్పి, జ్ఞాపిక బహూకరించిన చంద్రబాబు, పవన్
12-06-2024 01:51 PM
అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో నూతన ప్రభుత్వం కొలువుదీరింది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నూతన ముఖ్యమంత్రిగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ఏపీ మంత్రులుగా పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ప్రమాణ స్వీకారం చేయగా, వీరితో పాటు మొత్తం 24 మంత్రి ప్రమాణం చేశారు. ఏపీ మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి విచ్చేసిన ప్రదాని నరేంద్ర మోదీని సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి పవన్ కళ్యాణ్ శాలువా కప్పి, జ్ఞాపికను బహకరించారు. అనంతరం నూతన మంత్రివర్గంతో కలిసి ప్రధాని మోదీ ఫోటో దిగారు.ఈ కార్యక్రమానికి అతిరథ మహారథులు హాజరైన్నారు. ప్రముఖ సినీ, రాజకీయ ప్రముఖులు 36 మంది పాల్గొన్నారు. గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి ఒడిశాకు వెళ్లిన ప్రధాని మోడీ.. ఇవాళ సాయంత్రం ఒడిశా సీఎం ప్రమాణస్వీకారానికి హాజరుకానున్నారు.






