24 August, 2026 | 4:09 PM

రహదారిపై ఆక్రమణలు తొలగించాలి

24-08-2026 03:37 PM

బెజ్జంకి, ఆగస్టు 24: సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని బస్టాండ్ పరిసరాల్లో ప్రధాన రహదారిని ఆనుకుని దుకాణదారులు సామగ్రి ఏర్పాటు చేయడం, సెట్‌బ్యాక్ లేకుండా ఇళ్ల నిర్మాణాలు చేపట్టడం వల్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని అఖిల భారత యువజన సమాఖ్య మండల కార్యదర్శి దొంతరవేణి మహేష్ అన్నారు. ఈ సమస్యపై ప్రజావాణి కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

రహదారిని ఆక్రమించి ఉంచిన సామగ్రిని, అక్రమ నిర్మాణాలను తొలగించి రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. అధికారులు వెంటనే స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత యువజన సమాఖ్య సిద్దిపేట జిల్లా మాజీ అధ్యక్షులు బోనగిరి శ్రావణ్, మండల అధ్యక్షులు అంతటి రాకేష్, ఉపాధ్యక్షులు రోడ్డ లక్ష్మణ్, రోడ్డ చరణ్, బోనగిరి స్వామి, బాలమల్లు, రాజు తదితరులు పాల్గొన్నారు.