7 July, 2026 | 6:24 PM

Breaking News

"సర్" ప్రక్రియను ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలి   •   బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నాయకత్వానికి ఏడాది.. రామాలయంలో ప్రత్యేక పూజలు   •   ఆదివాసి నాయకపోడ్ కులస్తులకు దాతలకు హృదయపూర్వక ధన్యవాదాలు   •   ప్రభుత్వ ఉచిత విద్యను, సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలు చేరాలి   •   విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన పెద్దకాపర్తి సర్పంచ్   •   గౌలిగూడ కు వెళ్లాలా... అయితే ముక్కు మూయాల్సిందే...!   •   మృతుల కుటుంబాలకు పరామర్శ, ఆర్థిక సాయం   •   డబుల్ మర్డర్ కేసులో సంచలన తీర్పు   •   విడతల వారీగా యూరియా ఇవ్వడం సరికాదు   •   మున్సిపాలిటీలో పారిశుద్ధ్య పనులు   •  

ఆలయాల్లో తమిళమే వాడాలి

26-08-2024 04:53 AM

చెన్నై (తమిళనాడు), ఆగస్టు 25: ఆలయ ఆచార వ్యవహారాల్లో తమిళ భాషకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఆలయాల గర్భగుడిలో కుల వివక్ష ఉండకూడదని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్నారు. రాష్ట్రంలోని దిండిగల్ జిల్లాలోని పళనిలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న ముత్తమిజ్ మురుగన్ అంతర్జాతీయ సదస్సును ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం మాట్లాడుతూ.. ‘ప్రతీ ఒక్కరికి భిన్నమైన నమ్మకాలు, విశ్వాసాలు ఉంటాయి. వారి నమ్మకాలు, విశ్వాసాన్ని డీఎంకే ప్రభుత్వం గౌరవిస్తుంది.

అలాగే అన్ని మతాలకు రాష్ట్రంలో సముచిత స్థానం  కల్పిస్తున్నాం’ అని ఆయన తెలిపారు. దేవాలయాల అభివృద్ధి, భక్తులకు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో కల్పిస్తున్న సౌకర్యాల గురించి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులను అడిగి తెలుసుకున్నారు. మురుగన్ భక్తులను ఒకచోట చేర్చడం.. మురుగన్ ప్రధాన సూత్రాలను వ్యాప్తి చేయడం ఈ సమావేశ ప్రధాన లక్ష్యం అని సీఎం ఉద్ఘాటించారు. అయితే ఇటీవల సనాతన ధర్మం మీద డీఎంకే మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే.