calender_icon.png 15 August, 2025 | 10:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముద్విన్ నిరా కేంద్రాన్ని సందర్శించిన ఏపీ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి

07-04-2025 12:11:29 AM

కడ్తాల్, ఏప్రిల్ 6  : రంగారెడ్డి జిల్లా  కడ్తాల్ మండలంలోని ముద్విన్ గ్రామంలో తయారు చేస్తున్న  నీరా కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కర్నూల్ డివిజన్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక తీసుకొచ్చిననీరా కేఫ్ ను ఎంత టెంపరేచర్ లో సప్లై చేస్తున్నారు. 

ఏ ప్రాంతంలో  నీరా ప్రొడక్షన్ జరుగుతుంది. తదితర వివరాలను ఆమె ఆమనగల్ ఎక్సైజ్ సీఐ బద్యనాథ్ చౌహన్ తయారీదారులను అడిగి తెలుసు కున్నారు. నీరా నుండి వచ్చే బై ప్రొడకట్స్  ఎలా తయారు చేయాలి.వాటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని  తెలుసుకున్నారు. నీరా ను రుచి చూసి బాగుందనీ కితాబిచ్చారు. దీనిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  కూడా తయారు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

ఈత, తాటి చెట్ల నుంచి నీరాను ఎలా తీసుకుంటున్నారు. ఇందులో ఏవేవి కలుపుతున్నారు. వంటి విషయాలను అక్కడి తయారీ దారులు వివరించారు. అక్కడినుండి చరికొండ గ్రామంలో  కల్లు గీత కార్మికులు నీరాని ఎంత టెంపరేచర్ లో తీసుకుంటున్నారు.  వాటి వివరాలను రాసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట ఆమనగల్లు ఎక్సైజ్ ఎస్త్స్రలు సిబ్బంది పాల్గొన్నారు.