సాయి మందిరంలో యాత్రికులకు సేవలు అందించిన ఆలయ కమిటీ సభ్యులు
07-04-2025 12:07 AM
భద్రాచలం, ఏప్రిల్ 6 (విజయ క్రాంతి) భద్రాచలం జూనియర్ కళాశాల సెంటర్లో ఉన్న శ్రీ సాయి బాబా వారి మందిరములో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం ఉదయం బాబాకు అభిషేకం జరిపి స్వర్ణ ఆభరణాలు ధరింపజేసి హారతి పాడారు.శ్రీరామనవమి కి విచ్చేసిన యాత్రికులకు భక్తులు అందజేసిన విరాళాలతో ఆలయ ఉపాధ్యక్షులు మాగంటి శ్రీనివాస వరప్రసాద్, ప్రధాన కార్యదర్శి అబ్బినేని శ్రీనివాసరావు ఉదయం పానకం మజ్జిగ ప్రసాదం పంపిణీ చేశారు. మధ్యాహ్నం అన్నప్రసాద కార్యక్రమం ప్రారంభించారు. డాక్టర్ ఎస్ ఎల్ కాంతారావు దంపతులు బాబా ఆలయంలో పూల అలంకరణ చేయించారు. పలువురు భక్తులు విరాళాలు అందించగా విచ్చేసిన యాత్రికులకు పలు సేవలు అందేలా ఆలయ కమిటీ ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు






