22 April, 2026 | 7:19 PM

Breaking News

ఆర్టీసీ సమ్మెకు బిఆర్ఎస్ మద్దతు   •   గొర్రెల కాపరికి న్యాయం చేసిన పట్టణ సీఐ శివశంకర్   •   వేసవిలో ప్రజల దాహం తీర్చేందుకే చలివేంద్రాల ఏర్పాటు   •   గజ్వేల్ మహిళా డిగ్రీ కళాశాలలో ఘనంగా వార్షికోత్సవం   •   జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్ అర్హత సాధించిన బెల్లంపల్లి సీఓఈ విద్యార్థులు   •   అకాల వర్షం – అన్నదాత ఆగమాగం   •   ప్రభుత్వ వైద్యసేవల్లో నిర్లక్ష్యాన్ని ఉపేక్షించేది లేదు: ఎమ్మెల్యే బిఎల్ఆర్   •   త్రిలింగ రామేశ్వర ఆలయాన్ని ఉమ్మడి జిల్లా సందర్శించిన విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు   •   కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి: రవినాయక్   •   నకిలీ బిల్లులతో రూ.72 లక్షల దుర్వినియోగం   •  

ఏరియాను సందర్శించిన అప్మెల్ ఎండి నాగరాజు

12-06-2025 08:55 PM

మందమర్రి (విజయక్రాంతి): సింగరేణి అనుబంధ సంస్థ అప్మెల్ ఎండి నాగరాజు(MD Nagaraju) ఏరియాలో పర్యటించారు. గురువారం ఏరియా పర్యటనలో భాగంగా జిఎం కార్యాలయంకు రాగా ఏరియా జిఎం జి దేవేందర్ ఘన స్వాగతం పలికారు. అనంతరం జిఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈనెల 30వ తేదీన పదవి విరమణ పొందబోతున్న సందర్భంగా అప్మెల్ ఎండిని ఘనంగా ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు.

ఈ సందర్భంగా ఏరియా జిఎం మాట్లాడారు. ప్రతి ఒక్క అధికారికి పదవి విరమణ అనివార్యం అని, పదవి విరమణ అనంతరం వారి శేష జీవితం ఆయురారోగ్యాలతో సంతోషంగా సాగాలని ఆయన ఆకాంక్షించారు.ఈ కార్యక్రమం లో ఎస్ఓటు జిఎం విజయ్ ప్రసాద్, ఏరియా ఇంజనీర్ ఎజిఎం ఈఅండ్ఎం వెంకట రమణ, ఎస్కే గ్రూప్ ఏజెంట్ ఖాదిర్, పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యాంసుందర్, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ రవీందర్, ఎస్ఇ  ఐఇడి కె కిరణ్ కుమార్ డీజీఎం ఎఫ్అండ్ఎ ఆర్విఎస్ ఆర్కే ప్రసాద్, ఏరియా సీనియర్ అధికారులు పాల్గొన్నారు.