calender_icon.png 28 October, 2025 | 12:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బూర నర్సయ్యగౌడ్‌కు క్షమాపణ చెప్పాలి

28-10-2025 01:30:03 AM

మహజన సేన పార్టీ అధ్యక్షుడు తీగల ప్రదీప్ గౌడ్

ముషీరాబాద్, అక్టోబర్ 27 (విజయక్రాంతి): 42 శాతం బీసీ రిజర్వేషన్స్ కోసం ఇటీవల ఇందిరా పార్క్ ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నా కార్యక్రమానికి హాజరైన మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ మైక్ లాక్కొని అవమానించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని మహాజన సేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు తీగల ప్రదీప్ గౌడ్ అన్నారు. ధర్నా నిర్వాహకుడు విశారదన్ మహారాజ్ బేశరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

నవంబర్ 2లోపు జేఏసీ లోపాలు సరిదిద్దుకోవాలని, లేనిపక్షంలో తమిళనాడు తరహాలో ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు సోమవా రం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో పెట్టే అంశంపై బీజేపీ స్పష్టమైన వైఖరి చెప్పాలంటూ బూర నర్సయ్య గౌడ్ మైకు లాక్కొని మీటింగ్ నుంచి బయటికి వెళ్లగొట్టినంత పని చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పవన్, అనిల్ పాల్గొన్నారు.