calender_icon.png 28 October, 2025 | 1:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమిష్టిగా పనిచేయాలి

28-10-2025 01:30:10 AM

  1. ప్రచారానికి ఎవరికి వారే ప్రజల్లోకి వెళ్లాలి
  2. గెలుపు మనదే.. మెజారిటీ ఎక్కువ సాధించాలి
  3. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్
  4. ఇన్‌చార్జ్‌లతో పీసీసీ చీఫ్, మీనాక్షి, డిప్యూటీ సీఎం సమావేశం 

హైదరాబాద్, అక్టోబర్ 27 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ విజయం సాధించాల్సిందేనని, అందుకు ప్రతి ఒక్కరూ సమిష్టిగా పనిచేయాలని పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ అన్నారు. ఇన్‌చార్జ్‌లకు అప్పగించిన బాధ్యతలను పకడ్బందీగా అమలు చేయాలని, పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ అధికమోజార్టీతో విజయం సాధించాలన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని టూరిజం ప్లాజాలో జూబ్లీహిల్స్ ఎన్నికల బాధ్యులతో సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షినటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పోరేషన్ చైర్మన్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా మహేష్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమమని, మెజార్టీ కోసం మరింత కష్టపడాలన్నారు. ప్రతి 120 కోట్లకు ఒక ఇన్‌చార్జ్‌ని నియమించిన కాంగ్రెస్ పార్టీ, వారందరి ఓట్లు కాంగ్రెస్‌కు పడేలా చూడాలని దిశానిర్దేశం చేసినట్లుగా తెలిసింది. పోలింగ్ బూత్‌ల వారీగా నియమించబడిన ఇన్‌చార్జ్‌లు అభ్యర్థి వస్తేనే ప్రచారం నిర్వహిస్తామని అనుకోవద్దని, ఎవరికి వారే అభ్యర్థులుగా భావించి పనిచేయాలని సూచించారు.