14 April, 2026 | 5:22 PM

Breaking News

జగన్నాధపురంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   రాఘవపేటలో శ్రీ మల్లికార్జున స్వామి జాతర ఉత్సవం   •   ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   ప్రజలందరికీ రిజర్వేషన్ కల్పించిన ఘనత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్   •   బిజెపి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు   •   రాజ్యాంగ ఫలాలు ప్రతి ఇంటికి చేర్చాలి   •   షాపింగ్ కాంప్లెక్స్‌కు భూమి పూజ.. కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ   •   దేశ ఔన్నత్యానికి కృషి చేసిన దార్శనికుడు డాక్టర్ అంబేద్కర్   •   లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణకై కార్మికవర్గం ఉద్యమించాలి   •   డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   •  

అక్రిడిటేషన్ల కోసం దరఖాస్తుల స్వీకరణ

09-02-2026 12:00 AM

జిల్లా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్, కలెక్టర్ అభిలాష అభినవ్

నిర్మల్, ఫిబ్రవరి 8(విజయక్రాంతి): జిల్లాస్థాయి అక్రిడిటేషన్ కార్డుల జారీ కొరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సమాచార, పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో అక్రిడిటేషన్ మాడ్యూల్తో కూడిన వ్బుసైట్ను ప్రారంభించినట్లు ఆమె తెలిపారు. 2026-28 సంవత్సరాలకు గాను అక్రిడిటేషన్ కార్డుల జారీ కోసం ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించబడుతున్నాయని తెలిపారు.

ప్రస్తుతం అమల్లో ఉన్న అక్రిడిటేషన్ కార్డుల గడువు ఈ నెల 28వ తేదీతో ముగియనుందని, అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులకు నూతన అక్రిడిటేషన్ కార్డులు జారీ చేయబడతాయని పేర్కొన్నారు. మీడియా యాజమాన్యాలు తమ ప్రతినిధుల పేర్లను జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయానికి పంపించాలని సూచించారు. ఆ జాబితాలో ఉన్న అభ్యర్థులు https://ipr.telangana.gov.in వ్బుసైట్ ద్వారా ఈ నెల 9వ తేదీ నుండి ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించాలని కలెక్టర్ తెలిపారు.