19 March, 2026 | 12:48 PM

గ్రూప్-1 మెయిన్స్ శిక్షణకు దరఖాస్తులు

12-07-2024 12:05 AM

వికారాబాద్ రూరల్, జూలై 11 (విజయక్రాంతి): తెలంగాణ మైనార్టీ సంక్షేమ స్డడీ సర్కిల్ శాఖ అధ్వర్యంలో నిర్వహించే గ్రూప్- 1 మెయిన్స్ శిక్షణకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి కే హనుమంత రావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులను అభ్యర్థులు ఈ నెల 19 లోపు హైదరాబాద్‌లోని, గన్‌ఫౌండ్రీ మైనార్టీ సంక్షేమ స్డడీ సర్కిల్‌లో సంప్రదించాలని సూచించారు. ఇతర వివరాలకు 040-23236112 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.