26 August, 2026 | 9:44 PM

JEE/NEET స్పోకెన్ ఇంగ్లీష్ ఉపాధ్యాయుల కొరకు దరఖాస్తుల ఆహ్వానం.

26-08-2026 08:16 PM

సింగరేణి విద్యాసంస్థలలో పనిచేసే అవకాశం

కొత్తగూడెం,(విజయక్రాంతి): సింగరేణి పరిధిలోని వివిధ ఏరియాలలో గల సింగరేణి పాఠశాలలు,  కొత్తగూడెంలోని సింగరేణి కాలరీస్ మహిళా జూనియర్ కళాశాల, విద్యార్థుల విద్యా నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు, సింగరేణి ఎడ్యుకేషనల్ సొసైటీ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా సింగరేణి పాఠశాలల్లో విద్యార్థులకు ఆంగ్ల భాషలో చదవడం, రాయడం, మాట్లాడడం వంటి భాషా నైపుణ్యాలపై శిక్షణ అందించేందుకు సింగరేణి కాలరీస్ మహిళా జూనియర్ కళాశాల, కొత్తగూడెంలో విద్యార్థినులకు JEE/NEET వంటి ప్రవేశ పరీక్షలకు సంబంధించిన కోర్సులపై ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు అనుభవజ్ఞులైన అధ్యాపకులు, ప్రసిద్ధ విద్యా సంస్థల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు, జనరల్ మేనేజర్ (పర్సనల్)/సెక్రటరీ సింగరేణి ఎడ్యుకేషనల్ సొసైటీ జి.రాజేంద్ర ప్రసాద్ తెలియజేశారు.     

విద్యార్థుల ఆంగ్ల భాషా పరిజ్ఞానం, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, పోటీ ప్రవేశ పరీక్షల కు శిక్షణ అందించేందుకు ఆసక్తి, అర్హత,తగిన అనుభవం కలిగిన వ్యక్తులు/సంస్థలు తమ పూర్తి వివరాలు, ధృవీకరణ పత్రాలతో కూడిన దరఖాస్తులను తేదీ: 03.09.2026 లోపు కొత్తగూడెంలోని "జనరల్ మేనేజర్ (పర్సనల్) / సెక్రటరీ, సింగరేణి ఎడ్యుకేషనల్ సొసైటీ ఆఫీస్" నందు నేరుగా సమర్పించవలెను. మరిన్ని వివరాలకు 08744 248843 ఫోన్ నంబర్ కు సంప్రదించగలరు.