19-10-2025 01:10:57 PM
కరీంనగర్,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మద్యం పాలసీకి స్పందన కరువైంది. గత సీజన్ కంటే 3500 వరకు దరఖాస్తులు తగ్గాయి. ఉమ్మడి జిల్లా పరిధిలోని కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల ఎక్సైజ్ శాఖల పరిధిలో మొత్తం 294 మద్యం పాపులకు గాను 7188 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల ద్వారా 215 కోట్ల 64 లక్షల ఆదాయం సమకూరింది.
దరఖాస్తులు గత సీజన్ కంటే 3546 దరఖాస్తులు తక్కువగా రావడంతో దరఖాస్తుల గడువును ఈ నెల 23 వరకు పొదగించారు. లక్కీ డ్రా ను ఈ నెల 27 న తీయనున్నారు. ఇల కరీంనగర్ జిల్లాలో 94 దుకాణాల కు గాను 2652 వచ్చాయి. ఇదే కరీంనగర్ జిల్లాలో గత సీజన్ లో 4040 దరఖాస్తు లు వచ్చాయి. జగిత్యాల జిల్లాలో 71 దుకాణాలకు గాను 1824, పేద్దపల్లి జిల్లాలో 74 దుకాణాలకు గాను 1378, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 48 దుకాణాలకు గాను 1324 దరఖాస్తులు వచ్చాయి.