calender_icon.png 19 October, 2025 | 3:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సెంటనర్ కాలనీలో షాపులపైన సింగరేణి విజిలెన్స్ ఎంక్వయిరీ చేయాలి

19-10-2025 01:04:08 PM

బిజెపి ఎంపిటిసిల పోరం అధ్యక్షుడు మొలుమూరి శ్రీనివాస్

రామగిరి,(విజయక్రాంతి): రామగిరి మండలంలోని సెంటనర్ కాలనీలో షాపులో పైన సింగరేణి విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలని బిజెపి ఎంపిటిసిల పోరం అధ్యక్షుడు మొలుమూరి శ్రీనివాస్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కొందరు సింగరేణి అధికారులు షాప్ యజమానులు కలిసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒక పేదవాడు ఒక భూనిరసుడు ఒక సింగరేణి కార్మికుని కుమారునికి ఒక్క షాపు కూడా లేదని ఉన్న షాపులు ఒక్కొక్కరికి రెండు మూడు షాపులు తీసుకొని పదివేల నుంచి రూ.20వేలకు కిరాయిలకు ఇచ్చుకుంటున్నారు.

దీనిపైన సింగరేణి అధికారులు నిమ్ముకు నీరెత్తినట్టు వ్యవహరించడం పట్ల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. కార్మిక కుటుంబాల దగ్గర కూడా ఇష్టారాజంగా ధరలు అమ్ముతున్నారని, జిఎస్టి తక్కువైనా కూడా ధరలు తక్కువ చేయడం లేదని, ఒక్క యజమాని రెండు మూడు షాపులు కలిగి ఉండడం ఇది ఎక్కడి న్యాయమని, ఇది ఎక్కడి విడ్డూరమాని, సింగరేణి కంపెనీని దోచుకుంటున్న షాపు యజమానుల పైన చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో బిజెపి పార్టీ తరఫున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. సింగరేణి కంపెనీ 8వ కాలనీ మాదిరిగా ఒక 100 షాపులను సింగరేణి కంపెనీ నిర్మాణం చేసి భూ నిర్వాసితులకు మాజీ కార్మికులకు కార్మికుల పిల్లలకు ఉపాధికి కల్పించాలని, సింగరేణి కూడా లాభం వస్తదని తక్కువ రేటుతో కిరాయిలకు ఇవ్వాలని 100 షటార్లు నిర్మించాలని, ఈ సమస్య పైన కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి  దృష్టికి, సింగరేణి సిఎన్ఎండి అండ్ డైరెక్టర్ (పా)కు ఫిర్యాదు చేస్తామని,  బిఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య దృష్టికి తీసుకు వెళ్తామని తెలిపారు.