calender_icon.png 19 October, 2025 | 4:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గాంధీ.. భారతదేశానికి పర్యాయపదం

19-10-2025 01:34:12 PM

హైదరాబాద్: చార్మినార్‌లో రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర సంస్మరణ సభ ఆదివారం జరిగింది. సద్భావన యాత్ర సంస్మరణ దినోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. రాజీవ్ గాంధీ చిత్రపటం వద్ద సీఎం రేవంత్ రెడ్డి, మంత్రలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... గత 35 ఏళ్లుగా రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర జరుగుతోంది. గాంధీ.. భారతదేశానికి పర్యాయంపదమని అన్నారు. భారత్ లో అన్ని మతాల సహజీవనం స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు.

గాంధీ కుటుంబం కూడా దేశానికి అదే విధంగా స్పూర్తినిచ్చిందని ఆయన వెల్లడించారు. తమపై పోరాడిన మహాత్మాగాంధీని బ్రిటీషర్లు ఏమీ చేయలేకపోయారని, స్వాతంత్రం వచ్చిన కొద్ది నెలల్లోనే మతతత్వ వాదులు గాంధీని పొట్టనపెట్టుకున్నారని ముఖ్యమంత్రి తెలిపారు. గాంధీని హత్య చేసిన వారు బ్రిటీషర్ల కంటే ప్రమాదకరమైన వ్యక్తులు అని, దేశ సమగ్రత, సమైక్యత కాపాడడానికి ఇందిరాగాంధీ అసువులుబాసారు. ఇందిరాగాంధీ వారసత్వం, త్యాగాలను రాజీవ్ గాంధీ పుణికిపుచ్చుకున్నారని, దేశ సమగ్రతను కాపాడేందుకు రాజీవ్ గాంధీ కృషిచేశారని రేవంత్ రెడ్డి వెల్లడించారు. 

మతసామరస్యం దెబ్బతీసి దేశాన్ని విచ్ఛిన్నం చేసేటప్పుడు సద్భావన యాత్ర చేశారని, దేశ సమగ్రతను కాపాడడానికి చివరకు గాంధీ ప్రాణత్యాగం చేశారని ముఖ్యమంత్రి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీ వి.హనుమంత రావు, ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలీ షబ్బీర్, సీనియర్ నాయకుడు చిన్నారెడ్డి, కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.