ప్రజావాణికి పది దరఖాస్తులు
24-08-2026 | 06:02pm
మల్లాపూర్,(విజయక్రాంతి): మల్లాపూర్ మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం పది దరఖాస్తులు వచ్చినట్లు నోడల్ అధికారి, ఎంపీడీవో శ్రీకాంత్ తెలిపారు. రెవెన్యూ శాఖకు సంబంధించి ఎనిమిది దరఖాస్తులు, హౌసింగ్ శాఖకు ఒకటి, వెటర్నరీ శాఖకు సంబంధించి ఒక దరఖాస్తు వచ్చినట్లు పేర్కొన్నారు. ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ సమస్యలను పరిష్కరించేలా కృషి చేస్తామని ఎంపీడీవో శ్రీకాంత్ వెల్లడించారు.






