3 August, 2026 | 10:51 AM

ప్రజావాణికి 1,150 దరఖాస్తులు

24-08-2024 12:24 AM

హైదరాబాద్, ఆగస్టు 23 (విజయక్రాంతి): మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్‌లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణికి 1,150 దరఖాస్తులు అందినట్టు అధికారులు తెలిపారు. ఎస్సీ వెల్ఫేర్ శాఖకు 610, విద్యుత్ శాఖ, సింగరేణికి 115, పౌరసరఫరాల శాఖకు 113, మైనారిటీ సంక్షేమ శాఖకు 85, రెవెన్యూ పరమైన సమస్యలకు 69, ఇతర శాఖలకు 158 దరఖాస్తులు అందినట్టు వివరించారు. రాష్ర్ట ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ప్రజాపాలన ప్రత్యేక అధికారి దివ్య ఈ కార్యక్రమంలో పాల్గొన్ని దరఖాస్తులు స్వీకరించారు.